వైసీపీ ఎమ్మెల్సీలపై చైర్మన్ వేటు
ఊహించని షాక్ ఇచ్చిన మోషేన్ రాజు
అమరావతి – రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన మండలి సభ్యులకు బిగ్ షాక్ ఇచ్చారు. వీరిపై అనర్హత వేటు వేశారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న చర్యలతో ఒక్కసారిగా కలకలం రేపింది.
ఇదిలా ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపికి చెందిన ఎమ్మెల్సీలుగా ఉన్న వంశీ కృష్ణ, సీ. రామచంద్రయ్యలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు చైర్మన్ మోషేన్ రాజు. వంశీ కృష్ణ పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న సి. రామచంద్రయ్య నారా చంద్రబాబు నాయుడి సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో జంప్ అయ్యారు. పార్టీ జెండా ధరించారు.
ఈ ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలి చైర్మన్ కు , కార్యదర్శికి చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకున్నారు చైర్మన్.