అన్ని వర్గాలకు అండదండలు
మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి – రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి లోని 20వ వార్డులో మేదర సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన సామాజిక భవనం అదనపు గదిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.
సామాజిక భవనాన్ని యువతీ, యువకుల విద్యా, సామాజిక చైతన్యానికి వినియోగించు కోవాలని సూచించారు అంబటి రాంబాబు. అందుబాటులో ఉన్న వనరులు ను గుర్తించి సద్వినియోగ పర్చు కోవాలని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ఖాళీగా ఉన్న జాబ్స్ ను భర్తీ చేయడం జరుగుతోందని ఇప్పటికే నోటిఫికేషన్లు వేశామన్నారు అంబటి రాంబాబు.
అనంతరం మేదర సంఘం ఆధ్వర్యంలో మంత్రి అంబటిని ఘనంగా సత్కరించి సన్మానించారు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు, పలు వార్డుల కౌన్సిలర్లు , మున్సిపల్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు.