Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHవిశాఖ డెయిరీ స్కాంపై స‌భా క‌మిటీ

విశాఖ డెయిరీ స్కాంపై స‌భా క‌మిటీ

ఏర్పాటు చేయాల‌న్న అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి – రాష్ట్ర శాస‌న స‌భ‌లో విశాఖ డెయిరీపై వాడి వేడిగా చ‌ర్చ జ‌రిగింది. ఒకే కుటుంబం ఆధీనంలో ప్ర‌స్తుతం సంస్థ న‌డుస్తోందని, స‌హ‌కార సంస్థ నుంచి కార్పొరేట్ సంస్థ‌గా మార్చార‌ని, ఇక అక్క‌డి నుంచి జ‌వాబుదారీ లేకుండా పోయింద‌ని ఆరోపించారు మంత్రి ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు.

సీఐడీ లేదా జ్యూడీషియ‌ల్ లేదా స‌భా క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని కోరారు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు. దీనిపై స్పందించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. జగన్ మోహన్ రెడ్డి ఇసుక కుంభకోణం కన్నా విశాఖ డెయిరీ కుంభకోణం పెద్దదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

రైతుల నుంచి దోచుకున్న రూ. 400 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 2004లో కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ కంపెనీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏపీ మంత్రి.

దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల్సింది శాస‌న స‌భ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడుపై ఉంద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments