చంద్రబాబు పచ్చి అవకాశవాది
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్
అమరావతి – ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ట్రాప్ లో జంగా కృష్ణమూర్తి పడ్డారని అన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే నైజం టీడీపీదంటూ ధ్వజమెత్తారు. మీరు చేసిన ఆరోపణలు ఉపసంహరించుకుంటే మంచిదన్నారు.
టీడీపీ టికెట్ ఇస్తే తీసుకోండి, తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ జగన్ రెడ్డిపై నిందలు వేయడం మానుకోవాలని సూచించారు. ఎవరు బీసీల కోసం పని చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. వైసీపీ పాలనలో బీసీలు తల ఎత్తుకుని బతికారని అన్నారు.
బీసీలకు ఆత్మ రక్షకుడిగా పని చేశారంటూ జగన్ రెడ్డిని కొనియాడారు మంత్రి. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేసిన కామెంట్స్ ఆయన స్థాయికి తగదన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా జగన్ కు ఉన్న గౌరవం తరగదని తెలుసుకుంటే మంచిదన్నారు.
ఆరు నూరైనా సరే రాష్ట్రంలో వైసీపీ సర్కార్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.