వైసీపీకి షాక్ మంత్రి గుడ్ బై
జయహో సభలో టీడీపీలోకి
అమరావతి – అధికారంలో ఉన్న వైసీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. పార్టీ చీఫ్ , ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన మంత్రి జయరామ్. విచిత్రం ఏమిటంటే కీలకమైన నేతలు పార్టీనీ వీడుతున్నారు.
ఇప్పటికే వైసీపీకి చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్ సైతం ఇటీవలే వైసీపీని వీడారు. ఈ సందర్బంగా కేబినెట్ లో కీలకమైన మంత్రిగా ఉన్న జయరామ్ పార్టీకి గుడ్ బై చెప్పడం విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం అన్ని సర్వే సంస్థలు గంప గుత్తగా ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశాయి.
దీంతో టీడీపీ శ్రేణుల్లో భారీ ఎత్తున సంతోషం వ్యక్తం అవుతోంది. ఇవాళ ఇరు పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో బీసీ గర్జన సభ నిర్వహిస్తోంది. మరికొందరు సీనియర్ నేతలు పక్క చూపులు చూసే ఛాన్స్ ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా తాజాగా భారతీయ ఎన్నికల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరు నూరైనా సరే జగన్ రెడ్డి ఓడి పోబోతున్నాడంటూ జోష్యం చెప్పారు.