NEWSANDHRA PRADESH

మంత్రి భ‌రోసా బాధితుల‌కు ఆస‌రా

Share it with your family & friends

ప్ర‌శంసించిన సీఎం..డిప్యూటీ సీఎం

అమ‌రావ‌తి – బాధితుల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ , క‌ష్టాల్లో తాను ఉన్నానంటూ ముందుకు వ‌స్తున్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న నలుగురికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం విడుదలకు చర్యలు తీసుకున్నారు.

నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ సేవకుడినేనని నిరూపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని, కష్ట కాలంలో ఆదుకున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు బాధితులు.

పేద ప్రజల సంక్షేమమే తన అభిమతమని, నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ సేవకుడినేనని కందుల దుర్గేష్ మరోసారి నిరూపించారు. ఆపత్కాలంలో ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేక అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్)కి దరఖాస్తు చేసుకున్న వారికి తానే ద‌గ్గ‌రుండి మంజూరు చేయించారు. మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు.

పేదరికంతో బాధపడుతూ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తితే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని భావించిన మంత్రి దుర్గేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన వైద్యానికయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదల చేయించి భరోసా కల్పించారు. ఎవ‌రైనా స‌రే త‌న‌ను నేరుగా క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌చ్చ‌ని ఈ సంద‌ర్బంగా మంత్రి మ‌రోసారి హామీ ఇచ్చారు.