NEWSANDHRA PRADESH

వీరికే ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు – మంత్రి

Share it with your family & friends

పంపిణీకి సంబంధించి అర్హ‌త‌లు నిర్ణ‌యం

అమ‌రావ‌తి – ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే దీపావ‌ళి పండుగ నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కం ప్రారంభిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు కేబినెట్ కూడా ఏక‌గ్రీవంగా తీర్మానం చేసింది.

ఇదిలా ఉండ‌గా దీపం ప‌థ‌కం కింద ఉచితంగా గ్యాస్ సిలిండ‌ర్లు పొందాలంటే ఏయే అర్హ‌తలు ఉండాలనేది త‌మ ప్ర‌భుత్వం విధి విధానాల‌ను ఖ‌రారు చేసింద‌ని ఈ సంద‌ర్బంగా చెప్పారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

శుక్ర‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. దీపం ప‌థ‌కం పొందాలంటే ఏపీలో నివ‌సిస్తున్న వారై ఉండాలి. వారికి విధిగా ఎల్ పీజీ క‌నెక్ష‌న్ ఉండాలి. అంతే కాకుండా త‌ప్ప‌నిస‌రిగా స్థానికులేన‌ని నిర్ధారించేందుకు గాను ఆధార్ కార్డు క‌లిగి ఉండాల‌ని పేర్కొన్నారు.

ఈ ప‌థ‌కం అక్టోబ‌ర్ 31 నుంచి ప్రారంభం కానుంద‌ని ప్ర‌క‌టించారు నాదెండ్ల మ‌నోహ‌ర్. కాగా తొలి గ్యాస్ సిలిండ‌ర్ ను ఈనెల 29 నుండి బుక్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. కాగా 4 నెల‌ల‌కు ఒక సిలిండ‌ర్ పంపిణీ చేస్తామ‌ని, 2 రోజుల్లోగా బుక్ చేసుకున్న వెంట‌నే వినియోగ‌దారుల ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

పధకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నం -1967 ని ఏర్పాటు చేశామ‌ని, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.