నారా లోకేష్ ప్రజా దర్బార్
42వ రోజుకు చేరుకున్న కార్యక్రమం
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నిర్వహిస్తున్న ప్రజా దర్భార్ 42వ రోజుకు చేరుకుంది. బుధవారం ఎప్పటి లాగే నారా లోకేష్ తన ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రం నలు మూలల నుంచి బాధితులు క్యూ కట్టారు నారా లోకేష్ కు వినతలు ఇచ్చేందుకు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి వైద్య సాయం కోసం అందిన వినతులు సిబ్బందికి అందజేసి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నారా లోకేష్ . వైసీపీ హయాంలో వైసీపీ నేతలు కబ్జాలపై రాష్ట్రం నలుమూలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఈ సందర్బంగా తెలిపారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజా ప్రభుత్వం అందరికీ మేలు చేకూర్చేలా ప్రయత్నం చేస్తుందని నారా లోకేష్ బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. బాధితుల నుంచి వచ్చిన వందలాది వినతి పత్రాలను ఆయా శాఖల వారికి సమర్పించారు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు ఏపీ విద్యా , ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ .