పిలుపునిచ్చిన ఏపీ మంత్రి నారాయణ
అమరావతి – మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు మంత్రి నారాయణ. శనివారం నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ పై సమీక్ష నిర్వహించడం జరిగింది. శిక్షణ పొందిన మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు సర్టిఫికేట్లు, యూనిఫార్ములు అందజేశారు. మహిళల కోసం రూపొందించిన 108 స్టార్ట్‌అప్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహిళా వ్యాపారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 1000 మంది మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తొలి విడతలో 167 మెప్మా మహిళలకు స్టాల్స్ కేటాయించడం జరిగిందన్నారు మంత్రి నారాయణ. మహిళలకు 3 రోజుల పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శిక్షణ అందించామని తెలిపారు. .మహిళా వ్యాపారులకు సోలార్ పవర్, సబ్సీడీలు అందిస్తున్నామని ప్రకటించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్ధేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారని చెప్పారు. ప్రతీ ఇంటి నుంచీ ఒక మహిళా పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్నదే ఆయన లక్ష్యమని స్పష్టం చేశారు.
మహిళా వ్యాపారులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుందన్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ స్థలాన్ని MSME లకు కేటాయిస్తామన్నారు. దాంతో 40 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు నారాయణ.