తాడిపర్రు ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి
సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం
అమరావతి – ఏపీలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతి వేగం కొంప ముంచుతోంది. విలువైన ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఈ తరుణంలో సోమవారం తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటన తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
విద్యుదాఘాత మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు మంత్రి. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు నిమ్మల రామా నాయుడు. ఈ సందర్బంగా మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేశారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారం అందజేస్తామమని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా విషయం తెలిసిన వెంటనే తీవ్ర సంతాపం తెలిపారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల.