NEWSANDHRA PRADESH

నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌పై స‌మీక్ష‌

Share it with your family & friends

హాజ‌రైన ఉన్న‌తాధికారులు

అమ‌రావ‌తి – ఏపీలో సాగు నీటి ప్రాజెక్టుల‌పై స‌మీక్ష చేప‌ట్టారు ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. ఆయా ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, కాంట్రాక్ట్ ఏజెన్సీల‌ ప్రతినిధులు హాజ‌ర‌య్యారు.
ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, కడ కమీషనర్ రామసుందరరెడ్డి , ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు పూర్తి వివ‌రాలు మంత్రికి అంద‌జేశారు.

డిసెంబ‌ర్ మొద‌టి వారంలో ముఖ్య‌మంత్రి పోల‌వ‌రం లో ప‌ర్య‌టిస్తార‌ని తెలిపారు నిమ్మ‌ల రామానాయుడు. డయా ఫ్రం వాల్, ఈసిఆర్ఎఫ్ డ్యాం ప‌నులు షెడ్యూల్ విడుద‌ల‌పై రివ్యూ చేసిన‌ట్లు తెలిపారు.

పోల‌వ‌రం ట‌న్నెల్స్ బ్యాలెన్స్ ప‌నులు, లెప్ట్ కెనాల్ ప‌నుల పురోగ‌తిపై స‌మీక్ష చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల పురోగ‌తి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్ప‌టిక‌ప్పుడు వర్క్ అప్డేట్ చేయాలని ఆదేశించారు మంత్రి నిమ్మ‌ల రామా నాయుడు.

హంద్రీ-నీవా వెలిగొండ‌, చింత‌ల‌పూడి త‌దిత‌ర ప్రాధాన్య ప్రాజెక్టుల ప‌నుల ఆర్దిక ఇబ్బందుల‌ను అధిగ‌మించి పూర్తి చేయ‌డంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు.

సాగు నీటి సంఘాల ఎన్నిక‌లు ప్రశాంతంగా నిర్వ‌హించేవిధంగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. సాగునీటి సంఘాలకు డిసెంబర్ 8 వ తేదీన జరిగే ఎన్నికల కోసం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.