తుంగభద్ర డ్యాం వద్దకు డిజైన్ టీమ్
ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి – తుంగభద్ర డ్యాంకు సంబంధించి కృష్ణా నది వరద ఉధృతి కారణంగా 19వ నెంబర్ గేటు కొట్టుకు పోయింది. దీంతో కర్నూల్ జిల్లాలోని నాలుగు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు . వెంటనే ప్రత్యామ్నాయంగా పనులు చేపట్టాలని ఆదేశించారు .
ఆదివారం సచివాలయంలో అత్యవసర సమీక్ష చేపట్టారు సీఎం. ఈ సమీక్షలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్ పంపాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
స్టాప్ లాక్ అరేంజ్ మెంట్ ద్వారా నీరు వృథా పోకుండా చర్యలు చేపట్టాలని ప్రాధమికంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు సీఎం.
గేటు కొట్టుకు పోవడం వల్ల రైతులకు నష్టం కలగకుండా వరద నీటి నిర్వహణ ఒక ప్రణాళిక ప్రకారం చేయాలని సూచించారు. డ్యాం నిర్వహణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిది అయినా, నిర్వహణ ఖర్చు కింద, ఏపి రాష్ట్ర వాటా 35 శాతం ఉండటంతో, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు నిమ్మల రామానాయుడు.