రాయలసీమను రతణాల సీమగా మారుస్తాం
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి – రాయల సీమను రతణాల సీమగా మార్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆదివారం నంద్యాల జిల్లాలోని మాల్యాల పంప్ హౌజ్ ను పరిశీలించారు.
అనంతరం నిమ్మల రామా నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హంద్రీనీవ సామర్థ్యం పెంచేలా కృషి చేస్తామన్నారు. ప్రధాన కాలువ విస్తరించడానికే పర్యటించడం జరిగిందని చెప్పారు.
ఎన్టీఆర్ కల గన్నట్లు రాయల సీమను రతనాల సీమగా మార్చడం తప్పదన్నారు. ఆసియాలోనే పెద్దది , పొడవైన ఎత్తిపోతల పథకం నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని నిమ్మల రామానాయుడు.
3850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా మల్యాల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించామన్నారు. జగన్ పాలనలో హంద్రీ నీవా పనులు వెనుకబడి పోవడం బాధాకరమని అన్నారు మంత్రి. ప్రాజెక్ట్ సామర్థ్యం 40 టీఎంసీ లు ఐతే కనీసం 20 టీఎంసీ ల నీటిని కూడా రాయల సీమ కు అందించ లేదని వాపోయారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్ది , హంద్రీ నీవ ను పూర్తి స్థాయులో వినియోగం లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ లో చేసిన పాపాలు, తప్పులు సరిచేస్తున్నామని చెప్పారు నిమ్మల రామా నాయుడు.
అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి భాదితులను పరామర్శించ లేదని జగన్ రెడ్డిపై మండిపడ్డారు. కృష్ణా నదికి వరదలు వస్తే బస్సులో ఉండి పరిస్థితులు సరిదిద్ది ప్రజాపాలన ఎలా ఉంటుందో చేసి చూపించారు చంద్రబాబు నాయుడు అంటూ పేర్కొన్నారు.