త్వరలో వైఎస్సార్సీపీ ఖాళీ
మంత్రి రాం ప్రసాద్ రెడ్డి
అమరావతి – ఏపీ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలందరూ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌తో చాలా మంది టచ్‌లో ఉన్నారని చెప్పారు. త్వరలోనే వైసీపీ ఖాళీ కావడం ఖాయమన్నారు. ఒకవేళ ఎన్నికలు త్వరగా జరిగినా వైసీపీ నుంచి పోటీ చేసే వారే ఉండరన్నారు.
జగన్ రెడ్డి చేసిన రాచరిక పాలనను చూసి ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు విసిగి వేసారి పోయారని అన్నారు. ఇప్పటికే కీలకమైన ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీలో క్యూ కట్టారని చెప్పారు. ఇప్పటికే చాలా మంది నేతలు టచ్ లో ఉన్నారని, కానీ తామే ముందు వెనుకా ఆలోచిస్తున్నామని అన్నారు రాం ప్రసాద్ రెడ్డి.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పరివారానికే దక్కుతుందని ఆరోపించారు . అందుకే ప్రజలు కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారని, అయినా జగన్ రెడ్డికి బుద్ది రాలేదని ఎద్దేవా చేశారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి.