పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలి
మంత్రి సత్య కుమార్ యాదవ్ సమీక్ష
అమరావతి – ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ కీలకంగా ఉందని, ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించాలని అన్నారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు అవసరమైన సదుపాయాల కల్పనకు యుద్ద ప్రాతిపదికన ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ప్రధానంగా రహదారుల నిర్మాణం ముఖ్యమని అన్నారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులతో కలసి వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు.
రహదారులతో పాటు, తాగు నీరు, విద్య, వైద్యం, మురుగు నీటి పారుదల వంటి మౌలిక సదుపాయాల కొరత ఉండకూడదని స్ఫష్టం చేశారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా పని చేయాలని కోరారు మంత్రి.