ఆధునిక టెక్నాలజీ అద్భుతం
ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి – రోజు రోజుకు సాంకేతిక పరంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. మంగళగిరిలో జరుగుతున్న 52వ ఇండియన్ ప్రోస్థోడాంటిక్ సొసైటీ(ఐపీఎస్) జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం కట్టుడు పళ్ళ వైద్యరంగం ప్రజారోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు సత్య కుమార్ యాదవ్.
ఇలాంటి జాతీయ స్థాయి సదస్సుకు రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వడం గర్వ కారణంగా భావిస్తున్నానని అన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అంతర్జాతీయ స్థాయి కట్టుడుపళ్ళ వైద్యనిపుణుల ప్రసంగాలు, వారి అనుభవాలు రాష్ట్రంలోని వైద్యులకు, వైద్య విద్య అభ్యసించే వారికి ప్రేరణగా నిలుస్తాయని స్పష్టం చేశారు సత్య కుమార్ యాదవ్.
నిపుణులు, వైద్యరంగానికి చెందిన అనుభవజ్ఞులు ఇచ్చే సలహాలు, సూచనలు కొత్తగా ఈ రంగంలోకి ఎంటర్ అవుతున్న వారికి ఎంతగానో ఉపయోగ పడతాయని, వాటిని జాగ్రత్తగా నోట్ రాసుకోవాలని సూచించారు మంత్రి.