కితాబు ఇచ్చిన మంత్రి అనిత
అమరావతి – హోం మంత్రి వంగలపూడి అనిత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును ప్రశంసలతో ముంచెత్తారు. తను అద్బుతంగా పని చేస్తున్నాడని అన్నారు. భవానీ దీక్షల సందర్బంగా చేసిన భద్రతా ఏర్పాట్లు బాగున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా సైబర్ సిటిజన్ యాప్ పై అవగాహన కల్పిస్తున్న తీరు అద్భుతమన్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం అంటూ ప్రచారం చేస్తున్నారు సీపీ.
ఇదిలా ఉండగా విజయవాడ నగర సీపీ రాజశేఖర్ బాబు ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనితని మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్చం అందజేసినూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజధాని అమరావతిలో పలు ముఖ్య ప్రాంతాలలో ‘సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం. చెడు పోస్టు చేయొద్దు’ అంటూ కూటమి ప్రభుత్వం హోర్డింగ్ ల ద్వారా చేపట్టిన అవగాహన, ప్రచార కార్యక్రమానికి నగర పౌరుల నుంచి వస్తోన్న మద్దతుపై ఈ సందర్భంగా హోంమంత్రి చర్చించారు.