మార్గదర్శకుడు మహర్షి వాల్మీకి – అనిత
సర్వ ప్రజానీకానికి ఆయన స్పూర్తి దాయకం
అమరావతి – మహోన్నత మానవుడు మనందరికీ మార్గ దర్శకుడు మహర్షి వాల్మీకి అని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం , విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. గురువారం మహర్షి వాల్మీకి జయంతి . ఈ సందర్బంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు వంగలపూడి అనిత.
మూల రామాయణ రచయిత, సర్వ ప్రజానీకానికి మార్గ దర్శకుడు మహర్షి వాల్మీకి అని కొనియాడారు మంత్రి.
జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని లోకానికి చాటిన ఆ మహా పురుషుని జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు వంగలపూడి అనిత.
వాల్మీకి ఆదర్శ జీవితాన్ని గడపడానికి మానవులు ఆచరించాల్సిన ధర్మాలన్నిటినీ శ్రీ రామాయణ మహా కావ్యంలో పొందు పరచిన ఆదికవి వాల్మీకి అని ప్రశంసించారు. ఆయన జయంతిని సాంస్కృతిక ఉత్సవంగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఏపీ మంత్రి.