NEWSANDHRA PRADESH

రైత‌న్న‌ల‌కు భ‌రోసా మంత్రుల ఆస‌రా

Share it with your family & friends

పంటల‌ను ప‌రిశీలించిన వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భారీ ఎత్తున కురిసిన వ‌ర్షాల తాకిడికి పెద్ద ఎత్తున పంట‌ల‌ను కోల్పోయారు రైతులు. ఆరుగాలం శ్ర‌మించి పండించిన ధాన్యం త‌డిసి ముద్దైంది. వ‌రి పూర్తిగా చేతికి రాకుండా పోయింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో దెబ్బ తిన్న పంట‌ల‌ను, బాధిత రైతుల‌ను , నిరాశ్ర‌యులైన ప్ర‌జల‌కు భ‌రోసా క‌ల్పిస్తామ‌ని శాస‌న స‌భ సాక్షిగా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు మంత్రుల‌తో క‌మిటీని ఏర్పాటు చేశారు.

సీఎం ఆదేశాల మేర‌కు రాష్ట్ర మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, కందుల దుర్గేష్ , కింజార‌పు అచ్చెన్నాయుడు ఆదివారం తూర్పు గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా గ్రామాల‌లో తిరుగుతూ పంట‌లు కోల్పోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. పొలాల్లోకి వెళ్లి వారి గోడును విన్నారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఈ సంద‌ర్బంగా మంత్రులు అనిత‌, దుర్గేష్, కింజార‌పు హామీ ఇచ్చారు.

త‌మ ప్ర‌భుత్వం న‌ష్ట పోయిన రైతులు, బాధిత ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటుంద‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు హోం శాఖ మంత్రి.