జలాశయాల మరమ్మతులపై ఫోకస్
నిర్మాణాలపై దృష్టి సారించాలి
అమరావతి – నెల్లూరు జిల్లాలోని అనంత సాగరం మండలంలో ఉన్న సోమశిల జలాశయాన్ని పరిశీలించారు మంత్రులు నిమ్మల రామా నాయుడు, పొంగూరు నారాయణ, ఆనం రామ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, పాశం సునీల్ కుమార్ , కావ్య కృష్ణా రెడ్డి, విజయ శ్రీ, కాకర్ల సురేష్, కరుగొండ్ల రామకృష్ణ, ఇంటూరు నాగేశ్వర్ రావు. వీరి వెంట కలెక్టర్ ఆనంద్ కూడా ఉన్నారు.
సంజీవ రెడ్డి ఎత్తిపోతల పథక నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సోమశిల డ్యాం ముందు ఆఫ్రాన్ నిర్మాణం, రక్షణ గోడ, నిర్మాణ పనులు, మరమ్మతులు తదితర ముఖ్య అంశాలను వారు స్వయంగా పరిశీలించి సుదీర్ఘగంగా చర్చించారు.
సోమశిల జలాశయంలోని అఫ్రాన్. రక్షణ గోడ, నిర్మాణ పనులను,. చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా పెండింగ్ పనులను మంత్రులకు అధికారులు వివరించారు.
సోమేశ్వరాలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకి ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత వరదల కారణంగా దెబ్బతిన్న ఆలయ ప్రాంతాన్ని పరిశీలించి, పునః నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అక్కడి నుంచి కండలేరు జలాశయాన్ని పరిశీలించారు.