జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన అనిత
గంజాయి మాఫియాను పట్టించుకోలేదు
అమరావతి – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనా కాలంలో ఏనాడూ గంజాయి మాఫియా గురించి పట్టించుకున్నా పాపాన పోలేదంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై మండిపడ్డారు.
గురువారం జరిగిన శాసన మండలిలో గంజాయి నియంత్రణ, శాంతి భద్రతలపై మంత్రి సమాధానం ఇచ్చారు. గంజాయి మాఫియా, బ్లేడ్ బ్యాచ్ దుర్మార్గాలపై జగన్ రెడ్డి ఒక్క సమీక్ష చేయలేదని ధ్వజమెత్తారు వంగలపూడి అనిత.
ఇదే ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ గా మారిందన్నారు. చెక్ పోస్ట్ లు పెంచామని, అక్కడ అక్రంగా గంజాయిని తరలించకుండా ఉండేందుకు గాను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
దీని కారణంగా చాలా మటుకు గంజాయి అక్రమ రవాణా తగ్గిందన్నారు మంత్రి. ఇదే సమయంలో రెచ్చి పోతున్న బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు వంగలపూడి అనిత.