Saturday, April 5, 2025
HomeNEWSANDHRA PRADESHఎమ్మెల్సీ స్థానాల‌కు కూట‌మి అభ్య‌ర్థుల నామినేష‌న్

ఎమ్మెల్సీ స్థానాల‌కు కూట‌మి అభ్య‌ర్థుల నామినేష‌న్

సోమవారం నాటితో ముగిసిన నామినేష‌న్ గ‌డువు

అమ‌రావ‌తి – ఏపీ శాసన సభ సభ్యుల కోటాలో ప్రకటించిన‌ ఐదు శాసన మండలి సభ్యుల (MLC) ఎన్నికకు కూటమికి చెందిన నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాల్టితో ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగిసింది. టీడిపీ, జనసేన, బీజెపి కూటమి లోని జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు గత శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, టీడిపీ కి చెందిన ముగ్గురు అభ్యర్థులు, బీజెపీ కి చెందిన ఒక అభ్యర్థి దాఖ‌లు చేశారు. మొత్తం ఐదు స్థానాలకు ఐదురుగు కూటమి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది.

తొలుత టీడిపీ కి చెందిన ముగ్గురు అభ్యర్థులు వరుసగా బీద రవిచంద్ర, బి.టి.నాయుడు, కావలి గ్రీష్మ తమ నామినేషన్లను దాఖలు చేయగా తుదుపరి బీజెపీ కి చెందిన సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. తదుపరి ఈ నలుగురు అభ్యర్థులు తమ రెండో సెట్టు నామినేష్ పత్రాలను కూడా దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర శాసన సభ భవనంలో రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి ఆర్. వనితా రాణికి వరుసగా తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణి ఆయా నామినేషన్ పత్రాలను పూర్తిగా పరిశీలించిన పిదప భారత సంవిధానపు 173 (ఎ) పరచ్చేదము ప్రకారం ఒక్కొక్కరిచే ప్రతిజ్ఞ చేయించారు.

ఎం.ఎల్.సి. అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన బీద రవిచంద్రతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసన సభ్యులు పి.విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. కూటమిలోని బీజెపీకి చెందిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర ఆరోగ్య, వైద్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments