Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHకూట‌మి దూరం బొత్స ఎన్నిక లాంచ‌నం

కూట‌మి దూరం బొత్స ఎన్నిక లాంచ‌నం

పోటీ లేకుండానే చేతులెత్తేసిన టీడీపీ

విశాఖ‌ప‌ట్ట‌ణం – తెలుగుదేశం పార్టీ కూట‌మి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇది ఊహించ‌ని షాక్. ఈ జిల్లాలో స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించి మొత్తం 838 సీట్లు ఉండ‌గా ఇందులో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చెందిన వైఎస్సార్సీపీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు 530 మంది ఉన్నారు.

ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్‌, రాజ‌మండ్రి ఎంపీ భువ‌నేశ్వ‌రి. ఏకంగా కూట‌మి త‌ర‌పున తాజాగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీ టికెట్ ను ఆశించారు బైరా. ఆయ‌న‌ను కూట‌మి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు సీఎం.

చివ‌ర‌కు బ‌రిలో నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో వైఎస్సార్పీసీ నుంచి ఇప్ప‌టికే త‌మ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణను. ఆయ‌న ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌కు రూ. 93 ల‌క్ష‌లు అప్పు ఉందంటూ అఫిడ‌విట్ లో పేర్కొన్నారు.

ఆయ‌న ఎన్నిక లాంఛ‌నం కానుంది. ఇక ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా షేక్ ష‌ఫీ దాఖ‌లు చేశారు. ఒక‌వేళ త‌ను విర‌మించుకుంటే బొత్స ఎమ్మెల్సీగా గెలుపొంద‌డం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments