కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా
ప్రకటించిన కూటమి ప్రభుత్వం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విశాఖపట్టణం స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది. సోమవారం కూటమి తరపున అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నాయకుడు బైరా దిలీప్ చక్రవర్తిని ప్రకటించింది.
ఇదిలా ఉండగా 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ టికెట్ ను ఆశించాడు. కానీ నిరాశకు గురయ్యారు. దీంతో కూటమికి చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఉమ్మడిగా తమ అభ్యర్థిగా బైరాను ఖరారు చేశారు.
అన్ని విధాలుగా మాజీ మంత్రి బొత్స సత్య నారాయణను ఢీకొనే సత్తా, దమ్ము బైరా దిలీప్ చక్రవర్తికి ఉందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా వైసీపీ బాస్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి కంటే ముందే తమ పార్టీ అభ్యర్థిగా బొత్సను ప్రకటించారు.
ఇవాళ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు పోటీగా ప్రస్తుతం బైరా నిలవనున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నిక ఆగస్టు 30న జరగనుంది. ఈ ఎన్నిక కూటమికి ఛాలెంజ్ గా మారింది.