తాడేపల్లి ప్యాలెస్ కు భారీగా ఖర్చు
జగన్ పై విచారించేందుకు సర్కార్ రెడీ
అమరావతి – అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా తాడేపల్లి ప్యాలెస్ కు ఖర్చు చేసినట్లు ఉన్డీయే కూటమి ఆరోపిస్తోంది. ఇప్పటికే విశాఖలోని రుషి కొండపై రూ. 500 కోట్లతో ఖర్చు చేసిన ప్యాలెస్ పై రుషి కొండ కాదు అది అనకొండ అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు.
తాజాగా అధికారం కోల్పోవడంతో జగన్ రెడ్డి దేని కోసం ఎంతెంత ఖర్చు చేశారనే దానిపై వివరాలు బయటకు రావడం విస్తు పోయేలా చేసింది. కళ్లు చెదిరే భవంతికి మొత్తం ప్రజల సొమ్మునే వినియోగించారని విమర్శలు ఉన్నాయి.
ఐదేళ్లలో మొత్తం జగన్ రెడ్డి రూ. 45 కోట్లు ఖర్చు చేసినట్లు కూటమి ఆరోపిస్తోంది. ఏసీల కోసం రూ.1.5 కోట్లు.. ఆలయాల సెట్టింగ్‌లకు రూ.1.45 కోట్లు, టేబుళ్లు , ఇతర ఫర్నీచర్ కు రూ. 1.37 కోట్లు, సోఫాలు, కుర్చీలు ఇతరత్రా వాటికి రూ. 4.5 కోట్లు, వీడియో, టెలి కాన్ఫరెన్స్ లకు రూ. 3.45 కోట్లు, కిటికీలు, తలుపులకు రూ. 73 లక్షలు ఖర్చు చేశారంటూ మండి పడింది.
ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని కూటమి నేతలు సర్కార్ ను కోరుతున్నారు.