NEWSANDHRA PRADESH

డిజిట‌ల్ కార్పొరేష‌న్ లో అక్ర‌మాలు

Share it with your family & friends

జ‌గ‌న్ రెడ్డి బ‌హిరంగ దోపిడీపై విచార‌ణ

అమ‌రావ‌తి – ఏపీలో కొత్త‌గా కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ త‌వ్వే కొద్దీ జ‌గ‌న్ రెడ్డి చేసిన అవినీతి అక్ర‌మాలు ఒక్క‌టొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయి. గ‌డిచిన త‌న ఐదేళ్ల పాల‌నా కాలంలో మొత్తం వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని టీడీపీ ఆరోపించింది.

ప్ర‌భుత్వ కార్పొరేష‌న్ల‌ను భ్ర‌ష్టు ప‌ట్టించాడ‌ని పేర్కింది. ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ ను నిర్వహించే వ్యక్తికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారని మండిప‌డింది. వైసీపీ తొత్తులకు ఉద్యోగాల కోసం ఏకంగా కార్పొరేషన్ పెట్టి దోచిపెట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఒక చిన్న కార్పొరేషన్ లో 129 మంది ఉద్యోగులను తీసుకొని లక్షల్లో జీతాలు చెల్లించారని తెలిపింది. సాక్షికి ఇచ్చే యాడ్లకే కాకుండా జగన్ రెడ్డికి మేలు చేసేందుకు గూగుల్ యాడ్ల కోసం కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించింది.. డిజిటల్ కార్పొరేషన్ ను అస్తవ్యస్తంగా తయారు చేసి దోచుకున్నారని తెలిపింది. డిజిటల్ లైబ్రరీలకు కేటాయించిన రూ.750 కోట్లు ఏమయ్యాయో తెలియదని దీనిపై స‌మగ్ర విచార‌ణ చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించింది.