NEWSANDHRA PRADESH

క‌రెంట్ ఛార్జీల‌పై ష‌ర్మిల క‌న్నెర్ర

Share it with your family & friends

ఏపీసీసీ ధ‌ర్నాలో తీవ్ర ఆగ్ర‌హం

విజ‌య‌వాడ – ఏపీ టీడీపీ కూట‌మి స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. బుధ‌వారం ఏపీకాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లోని ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ఆందోళన చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలు 17 వేల కోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ స‌ర్కార్ ప్ర‌జ‌ల‌పై పెను భారం మోప‌డం దారుణ‌మ‌న్నారు.

సర్దుబాటు భారం వైసీపీ చేసిన పాపం అయితే… కూటమి ప్రభుత్వం పెడుతున్న శాపంగా మారింద‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయిందని పేర్కొన్నారు. 5 నెలల్లోనే ప్ర‌జ‌ల‌కు హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారని ఆరోపించారు.

కరెంటు చార్జీల భారాన్ని మోపడం దారుణ‌మన్నారు. ఇప్పటికే 6 వేల కోట్ల భారం మోపారని ఆరోపించారు. ఇది చాలదు అన్నట్లు ఇంకో 11 వేల కోట్లు సిద్ధం చేశారని వాపోయారు. మొత్తం 17 వేల కోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారని ఫైర్ అయ్యారు.

ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు అంటూ ప్ర‌శ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పై ఎన్నో హామీలు ఇచ్చారని, వైసీపీ 9 సార్లు పెంచిందని గగ్గోలు పెట్టారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. తెలుగు దేశం అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదు అన్నారు. ఛార్జీలు త‌గ్గిస్తామ‌ని చెప్పి ఇపుడు కుర్చీ ఎక్క‌డా క‌రెంట్ ఛార్జీలు పెంచ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు ఏపీపీసీసీ చీఫ్‌.

జగన్ మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 35 వేల కోట్లు భారం మోపితే కూట‌మి స‌ర్కార్ కేవ‌లం 5 నెల‌ల్లోనే రూ. 17 కోట్ల భారం మోపేందుకు చూడ‌డం పై మండిప‌డ్డారు విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయ‌న్నారు..మ‌రి ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదంటూ ప్ర‌శ్నించారు. హిందూజా లాంటి కంపెనీకి 12 వందల కోట్లు ఎందుకు ఇచ్చారో తేల్చాలన్నారు.