కేరళలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేరళ – మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనను కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో తను ఏ4గా ఉన్నారు. గత కొంత కాలంగా చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కూటమి సర్కార్ పై ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. తనకు హైకోర్టులో చుక్కెదురైంది. తనను అరెస్ట్ చేస్తారని తెలుసుకున్న కాకాణి జంప్ అయ్యారు. ఎట్టకేలకు కేరళలో చిక్కారు.
ఇదిలా ఉండగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన అదృశ్యమయ్యారు. ఇక గత రెండు నెలలుగా తప్పించుకు తిరిగారు. ఎట్టకేలకు తనను పట్టుకోవడం వైసీపీ శ్రేణులను విస్తు పోయేలా చేసింది. ఇప్పటికే అదే పార్టీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకుంది. మరో వైపు జగన్ రెడ్డికి సహకరించారనే నెపంతో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు చేసింది.
వారిలో సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మాజీ చీఫ్ సెక్రటరీ ధనంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డిలను సైతం అదుపులోకి తీసుకున్నారు. వారికి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. మొత్తంగా ఏపీలో సీన్ మారింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ జగన్ రెడ్డి ఆరోపించారు.