కానిస్టేబుల్ పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్
29వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి
అమరావతి – రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే కూటమి సర్కార్ కొలువు తీరాక పరీక్షల నిర్వహణపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే డీఎస్సీ నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
మరో వైపు ఏపీలో కానిస్టేబుల్ స్టేజ్-2 PMT/PET పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. పోలీస్
నియామక మండలి అందుబాటులో ఉంచింది. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించాలని కోరింది. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని అప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొంది.