అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం
లుక్ అవుట్ నోటీసులు జారీ
రేషన్ బియ్యం స్కాం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టు, పేర్ని జయసుధలకు బిగ్ షాక్ తగిలింది. విచారణకు సంబంధించి హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో గోడకు అంటించారు . ఇదిలా ఉండగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. దీంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించారు. గోడౌన్ లలో 4800 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టినట్టు గుర్తించారు.
ఇదిలా ఉండగా ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రేషన్ బియ్యానికి సంబంధించి. పేర్ని జయసుధ గోదాములో 3 వేల బస్తాలు కాదు… 4840 బస్తాలు మాయమయ్యాయని ఆరోపించారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టామన్నారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తనిఖీలకు సహకరించడం లేదని, రెండో గోడౌన్ పైనా అనుమానాలు ఉన్నాయని అన్నారు.
డబ్బులు చెల్లించినంత మాత్రాన తాము ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఎక్కడికి వెళ్లినా పట్టుకుని తీరుతామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో పేర్ని నాని ఎన్నో నీతి వాక్యాలు వల్లించారని ధ్వజమెత్తారు. అన్ని శాఖలలో చోటు చేసుకున్న వ్యవహారాలపై విచారణ చేపడతామని హెచ్చరించారు.