NEWSANDHRA PRADESH

మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్

Share it with your family & friends

లుక‌వుట్ నోటీసులు జారీ

అమ‌రావ‌తి – మాజీ మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య అలియాస్ నానికి కోలుకోలేని షాక్ త‌గిలింది. కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక వైసీపీ నేత‌ల బండారం బ‌య‌ట‌ప‌డుతోంది. కీల‌క‌మైన నేత‌లు క‌నిపించ‌కుండా పోతున్నారు. మ‌రికొంద‌రు కూట‌మి లో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తాజాగా కేసుల జాత‌ర మొద‌లైంది. ఇందుకు సంబంధించి టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌పై అవాకులు చెవాకులు పేలుతూ వ‌స్తున్న మాజీ మంత్రి పేర్ని నానికి చుక్క‌లు చూపిస్తున్నారు పోలీసులు. ఆయ‌న భార్య పేరు మీద ఉన్న గోదాముల‌లో రేష‌న్ బియ్యం ప‌క్క‌దారి ప‌ట్టింద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

వెంట‌నే కేసు న‌మోదు చేసి విచార‌ణ‌కు ఆదేశించింది ప్ర‌భుత్వం. దీంతో ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈనెల 19వ తేదీకి విచార‌ణ వాయిదా వేసింది కోర్టు. దీంతో త‌న భార్య‌తో పాటు త‌న‌ను కూడా అరెస్ట్ చేస్తారేమోన‌ని గాయ‌బ్ అయ్యారు.

దీంతో విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని పోలీసులు ఏకంగా పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు న‌మోదు చేశారు. 2 దఫాలుగా రూ.1.70 కోట్లు చెల్లించిన పేర్ని నాని..

ఈ నెల 13 రూ.కోటి, నిన్న రూ.70 లక్షల డీడీలు అందజేశారు . కాగా పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉన్న గోదాముల్లో ఎంత బియ్యం తగ్గిందనే దానిపై విచార‌ణ చేప‌ట్టారు. 3,708 బ‌స్తాల బియ్యం త‌గ్గింద‌ని తేల్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *