విచారణకు హాజరు కావాలని ఆదేశం
అమరావతి – మాజీ మంత్రి పేర్ని నానికి కోలుకోలేని షాక్ తగిలింది. రేషన్ బియ్యం స్కామ్ కేసుకు సంబంధించి పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు.
కాగా ఇదే కేసులో బెయిల్ మంజూరు చేసింది జిల్లా కోర్టు. ఇదిలా ఉండగా పేర్ని నాని కుటుంబంలో ఎవరూ లేక పోవడంతో నోటీసులు అంటించారు. కాగా బెయిల్ మంజూరు చేసినా విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించారు.
ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకమైన మంత్రిగా ఉన్నారు పేర్ని నాని. తన భార్య పేర్ని జయసుధ పేరుతో గోడౌన్ ఉండడం, ఇందులో ప్రభుత్వానికి సంబంధించి పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం నిల్వ ఉంచారు.
దాదాపు వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలించారని కూటమి సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు విచారణకు ఆదేశించింది. తనిఖీ సందర్బంగా మాజీ మంత్రి భార్య జయసుధకు చెందిన గోడౌన్ లో ఏకంగా రూ. 4 వేల టన్నులకు పైగా పక్కదారి పట్టినట్లు గుర్తించారు.