Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHపేర్ని నాని..పేర్ని కిట్టూకు నోటీసులు

పేర్ని నాని..పేర్ని కిట్టూకు నోటీసులు

ఇంటికి అతికించామ‌ని వెల్ల‌డి
అమ‌రావ‌తి – మాజీ మంత్రి పేర్ని నాని, ఆయ‌న కుమారుడు పేర్ని కిట్టుకు బిగ్ షాక్ త‌గిలింది. రేష‌న్ బియ్యం మాయంపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేష‌న్ బియ్యం మాయ‌మైన కేసుకు సంబంధించి పోలీసులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేశారు.

విచార‌ణ‌లో భాగంగా తండ్రీ కొడుకులు ఇద్ద‌రికీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్ల‌గా ఇంట్లో ఎవ‌రూ లేరు. దీంతో త‌లుపుల‌కు నోటీసులు అంటించారు . ఈ కేసులో నాని భార్య జ‌య‌సుధ‌, పీఎస్ మాన‌స తేజ ఉన్నారు.
మధ్యాహ్నం 2 గంటల లోపు స్టేషన్‌కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.

ఇదిలా ఉండ‌గా ఏపీ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రేష‌న్ బియ్యానికి సంబంధించి. పేర్ని జయసుధ గోదాములో 3 వేల బస్తాలు కాదు… 4840 బస్తాలు మాయమ‌య్యాయ‌ని ఆరోపించారు. దీనిపై లోతుగా విచార‌ణ చేప‌ట్టామ‌న్నారు. త‌ప్పు చేసిన వారిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. త‌నిఖీల‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని, రెండో గోడౌన్ పైనా అనుమానాలు ఉన్నాయ‌ని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments