NEWSANDHRA PRADESH

డిప్యూటీ సీఎంకు స‌లాం

Share it with your family & friends

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు వెల్ క‌మ్

అమరావ‌తి – కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండ‌దు. ఇది న‌గ్న స‌త్యం. మొన్న‌టి వ‌ర‌కు త‌ను అంద‌రి లాగే నాయ‌కుడు. ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగిన న‌టుడు .జ‌న‌సేన పార్టీని స్థాపించాడు. రెండు సార్లు పోటీ చేశాడు. కానీ ఓడి పోయాడు. ఎక్క‌డా త‌గ్గ లేదు.

ఒంట‌రి పోరాటం చేశాడు. త‌న‌ను గేలి చేసినా, విమ‌ర్శించినా, తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు గుప్పించినా చివ‌ర‌కు త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి అన‌రాని మాట‌లు అన్నా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. కానీ ఎదిరించి త‌ట్టుకుని నిల‌బ‌డ‌డ‌మే కాదు చెప్పింది చేసి చూపించాడు.

ఏదో ఒక‌రోజు జ‌గ‌న్ రెడ్డిని ఓడిస్తాన‌ని, అడ్ర‌స్ లేకుండా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అన్న‌ట్టుగానే ఆ పార్టీని 11 సీట్ల‌కే ప‌రిమితం చేశాడు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సాక్షాత్తు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అంద‌రి స‌మ‌క్షంలో ప‌వ‌న్ గురించి తుఫాన్ అంటూ కితాబు ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎంగా కొలువు తీరాడు. ఏ పోలీసులైతే త‌న‌ను ఇబ్బంది పాలు చేశారో వారితోనే సెల్యూట్ తీసుకున్నాడు.