NEWSANDHRA PRADESH

ఏపీ రెవెన్యూ లోటు రూ. 24,758.22 కోట్లు

Share it with your family & friends

వార్షిక బడ్జెట్ రూ. 2,86,389.27 కోట్లు
అమ‌రావ‌తి – ఈ ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించి ఏపీ ఆర్థిక శాఖ మంత్రి ఓట్ అకౌంట్ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఐదేళ్ల కిందట తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు.

రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పాత, మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంబించామని బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి బుగ్గన తెలిపారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టామని చెప్పారు.

వార్షిక బ‌డ్జెట్ రూ. 2,86,389.27 కోట్లుగా పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. రెవెన్యూ వ్యయం రూ. 2,30,110.41 కోట్లు
ఉండ‌గా మూలధన వ్యయం రూ. 30,530.18 కోట్లుగా చూపించారు. ఇక రెవెన్యూ లోటు రూ. 24,758.22 కోట్లు ఉండ‌గా , ద్రవ్య లోటు రూ. 55,817.50 కోట్లు ఉందంటూ స్ప‌ష్టం చేశారు.

జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం ఉండ‌గా రెవిన్యూ లోటు మాత్రం 1.56 శాతంగా ఉండ‌డం ఒకింత ఆందోళ‌న క‌లిగించే అంశం. ఇదిలా ఉండ‌గా న‌వ ర‌త్నాలు పేరుతో జ‌నం చెవుల్లో పూలు పెట్టాడంటూ ప్ర‌తిప‌క్షాలు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ , కాంగ్రెస్ విమ‌ర్శిస్తున్నాయి.