ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు
అమరావతి – ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని తాము డిమాండ్ చేయడం లేదన్నారు. ఇవ్వాలా లేదా అన్నది తాము నిర్ణయించమని, ప్రజలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
గత కొంత కాలంగా తమ పార్టీ నుంచి కొందరు మంత్రులు, సీనియర్లు డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ చేయడం తన దృష్టికి కూడా వచ్చిందన్నారు. స్పీకర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. అదంతా హైకమాండ్ చూసుకుంటుందన్నారు. స్పీకర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా తను లోపట ఒకటి పెట్టుకుని మాట్లాడటం ఇష్టం ఉండదు చింతకాయల అయ్యన్న పాత్రుడు. తనకు ఏది తోస్తే అది మాట్లాడటం ఆయనకు అలవాటు. ప్రస్తుతం నారా లోకేష్ నెంబర్ 2గా ప్రభుత్వంలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయ్యన్న పాత్రుడు. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అయినా ఎక్కడా తగ్గలేదు. తన వాయిస్ ను పెంచుకుంటూ పోయారు.
మాజీ సీఎం జగన్ రెడ్డిని, ఆనాటి మంత్రులను ఏకి పారేశారు. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు షాకింగ్ కామెంట్స్ చేస్తుంటారు. తన గొంతును స్పీకర్ చేసి నొక్కేశారంటూ చంద్రబాబుపై ఆ మధ్యన సెటైర్ కూడా వేశారు చింతకాయల అయ్యన్న పాత్రుడు.