ఏపీని కాపాడాలని కోరుకున్నా
తిరుమల – తిరుమలను సందర్శించారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి. ఈ సందర్బంగా టీటీడీ పాలక మండలి సభ్యులు, ఈవో సాదర స్వాగతం పలికారు. అయ్యన్నపాత్రుడితో పాటు సతీమణి పద్మావతి శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తుల మధ్య అన్నప్రసాదం స్వికరించారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వరుని కృపా కటాక్షాలు సర్వ జనులకు లభించాలని ఆకాంక్షించారు. దేవస్థానం వృద్ధి, భక్తుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన దంపతులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రంగనాయక మండపములో వేద పండితులు వేదాశీర్వచనము చేశారు. స్వామి వారి ప్రసాదం, చిత్ర పటం అందజేశారు అయ్యన్న పాత్రుడు దంపతులకు.