రామన్న వల్లనే నేనింతటి వాడినయ్యా
భావోద్వేగానికి లోనైన అయ్యన్న పాత్రుడు
అమరావతి – నేను జీవితంలో మరిచి పోలేని వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని అన్నారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయన గనుక 25 ఏళ్ల కిందట రాజకీయ పరంగా ఛాన్స్ ఇవ్వక పోతే నేను మీ ముందు ఇలా మాట్లాడి ఉండే వాడిని కానని అన్నారు. ఈ రాజకీయ భిక్ష పెట్టిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. అంతే కాదు మంత్రి పదవి కట్టబెట్టారు. ఇదంతా ఆ మహా అరుదైన నాయకుడి వల్ల కలిగిందని అన్నారు. ఎక్కడ నేను ..ఒక అనామకుడి స్థానం నుంచి ఇవాళ అత్యున్నతమైన సభా పతి స్థానంలో కూర్చున్నానని అంటే అదంతా ఎన్టీఆర్ చలవ వల్లనే సాధ్యమైందని చెప్పారు చింతకాయల అయ్యన్న పాత్రుడు.
తన జీవిత కాలంలో మరిచి పోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎన్టీఆర్ మాత్రమేనని అన్నారు. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు , ఆటుపోట్లు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తు తరాలు గుర్తు పెట్టుకునేలా నేటి తరం నేతలు మసలు కోవాలని సూచించారు అయ్యన్న పాత్రుడు.