నిప్పులు చెరిగిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు
అమరావతి – ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ తనను బెదిరించే ధోరణిలో ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదంటూ లేఖ రాశారంటూ మండిపడ్డారు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉన్న తను ఇలా పేర్కొనడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది శాసన సభ రూల్స్ ఆధారంగా నిర్ణయించడం జరుగుతుందన్నారు.
ఎలా పడితే అలా..ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వరని జగన్ తెలుసుకుంటే మంచిదని సూచించారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. బుధవారం జరిగిన ఏపీ శాసన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ ప్రకటన చేశారు.
ప్రతిపక్ష హోదాపై జగన్ హైకోర్టుకు వెళ్లారు..ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.. జగన్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలో ఉంది.. అభియోగాలు, బెదిరింపులతో జూన్‌లో జగన్ నాకు లేఖ రాశారని చెప్పారు స్పీకర్. లోక్‌సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది వాస్తవం కాదన్నారు. ఆనాడు టీడీపీ గ్రూప్ నేతగా మాత్రమే గుర్తించారని తెలుసుకుంటే మంచిదన్నారు.