కితాబిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు
బీహార్ – ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బీహార్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రసిద్ది చెందిన వైశాలి చారిత్రక స్థూపాన్ని సందర్శించారు. స్పీకర్ సతీమణితో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు , ఏపీ శాసన సభ వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ కూడా ఉన్నారు. వైశాలి, కొల్హువా లోని విశిష్టమైన చౌద్ద స్థూపాన్ని సందర్శించి శిల్ప కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఏకైక అశోక స్తంభం ఎంతో అద్భుతంగా ఉందన్నారు స్పీకర్.
అప్పటి అశోక చక్రం పర్యాటక ప్రాంతంగా మారి పోయిందన్నారు. ఇది ఒక రకంగా శిల్పుల ప్రతిభకు తార్కానంగా నిలిచి పోయిందని పేర్కొన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. నీతికి , ధర్మానికి , న్యాయానికి ప్రతీకగా ఆనాటి అశోకుడి పాలన సాగిందని పేర్కొన్నారు .
ఈ దేశంలో ఎన్నో ప్రసిద్దమైన బౌద్దారామాలు ఉన్నాయని, అనేక విశిష్టమైన ఆలయాలు కూడా ఉన్నాయని తెలిపారు. వీటిని పరిరక్షించు కోవడం మనందరి బాధ్యత అన్నారు. ఏపీలో కూడా దర్శనీయ స్థలాలు లెక్కలేనన్ని ఉన్నాయని, దక్షిణ ప్రాంతంలో అత్యధిక ఆదాయం కలిగిన ఏకైక గుడి తిరుమల అని తెలిపారు.