కన్నా ఆహ్వానం అయ్యన్న సంతోషం
మాజీ మంత్రి ఇంటికి ఏపీ స్పీకర్ రాక
గుంటూరు జిల్లా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ నివాసానికి వెళ్లారు. ఈ సందర్బంగా ఘనంగా స్వాగతం పలికారు కన్నా లక్ష్మీనారాయణ.
శాసన సభ సభాపతిని ప్రత్యేకంగా తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు కన్నా లక్ష్మీ నారాయణ. గత కొన్నేళ్లుగా అయ్యన్న పాత్రుడు, లక్ష్మీ నారాయణ మంచి స్నేహితులుగా ఉన్నారు. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి వీరిద్దరూ ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్బంగా తనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పడం పట్ల సంతోషానికి లోనయ్యారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. రాజకీయ పరంగా అపారమైన అనుభవం కలిగిన నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ అంటూ కితాబు ఇచ్చారు స్పీకర్.
ఇదిలా ఉండగా అయ్యన్న పాత్రుడు ఆత్రీయుడని, తనకు ఉన్న కొద్దిపాటి మిత్రులలో తను కూడా ఒకరు అని ప్రశంసలు కురిపించారు కన్నా లక్ష్మీ నారాయణ. ఈ సందర్బంగా స్వయంగా కన్నా తన అధికారికంగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఫోటోలను షేర్ చేశారు.