విశాఖ డెయిరీ వ్యవహారం స్పీకర్ ఆగ్రహం
వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్
అనకాపల్లి – ఏపీ రాష్ట్ర శాసన సభ సభాపతి (స్పీకర్) చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ డెయిరీ (పాడి పరిశ్రమాభివృద్ది సంస్థ ) పై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమాన్ని విశాఖ డెయిరీ పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. దీంతో పాడిని నమ్ముకున్న రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు.
రైతులను ఆదు కోవాల్సిన విశాఖ డెయిరీ పూర్తిగా స్వలాభం కోసం పని చేస్తోందని ధ్వజమెత్తారు. విశాఖ డెయిరీ వ్యవహారంపై వెంటనే రాష్ట్ర సర్కార్ స్పందించాలని కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు యుద్ద ప్రాతిపదికన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అసలు విశాఖ డెయిరీలో ఏం జరుగుతోందనే దానిపై రైతులకు, ప్రజలకు వాస్తవాలు తెలియ చేయాలని కోరారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. విచిత్రం ఏమిటంటే డెయిరీ వ్యవహారాలపై అన్ని పార్టీలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.