ఎన్టీఆర్ పుణ్యం అన్న దానం – స్పీకర్
గుర్తు చేసుకున్న అయ్యన్న పాత్రుడు
తిరుమల – ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. ఆయన తిరుమలను సందర్శించారు కుటుంబ సమేతంగా . ఈ సందర్బంగా ఆయన విజిటర్స్ పుస్తకంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్బంగా ఎన్టీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. 1985లో సంవత్సరంలో పెద్దాయన రోజుకు 2,000 మంది భక్తులకు అన్నదానం చేసేందుకు ఆనాడు ప్రారంభించారని తెలిపారు. ఇవాళ ఎన్టీఆర్ పుణ్యమా అని ప్రారంభమైన ఈ అన్న దానం నిరాటంకంగా కొనసాగుతోందని అన్నారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రోజుకు 1,00,000 మందికి భోజన వసతి కల్పించే కార్యక్రమంగా మారడం అద్భుతమని కొనియాడారు. ఇవాళ ఎన్టీఆర్ భౌతికంగా లేక పోయినా ప్రతి ఒక్కరిలో ఉన్నాడని అన్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడు.
దీనికి సహకరించిన భక్తులకు, దాతలకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు స్పీకర్. ఇదే సమయంలో ప్రతి రోజూ వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్న టీటీడీ ఉన్నతాధికారులను, వంట తయారు చేసే వారిని అభినందించారు చింతకాయల అయ్యన్న పాత్రుడు.