NEWSANDHRA PRADESH

ఒక రోజు ముందే పెన్ష‌న్ల పంపిణీ

Share it with your family & friends

స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు
అమ‌రావ‌తి – పేద‌లు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని త‌మ ప్ర‌భుత్వం ఒక రోజు ముందుగానే పెన్ష‌న్లు పంపిణీ చేస్తోంద‌ని అన్నారు ఏపీ స్పీకర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. శ‌నివారం గొలుగొండ మండలం ఏటిగైరంపేటలో వర్షంలోనే పింఛన్ల పంపిణీ చేశారు.

సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గ‌త వైసీపీ స‌ర్కార్ హ‌యాంలో పింఛ‌న్ల పంపిణీకి మూడు రోజుల స‌మ‌యం ప‌ట్టేద‌న్నారు. కానీ చంద్ర‌బాబు చొర‌వ‌తో ఆ ఇబ్బందులు లేకుండా చేశార‌ని చెప్పారు స్పీక‌ర్.

ఈసారి ఒకటో తేదీ ఆదివారం కావడంతో, 30న పింఛన్లను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే పింఛన్లను రూ. 4,000కు పెంచి సజావుగా పంపిణీ చేసే విధానానికి శ్రీకారం చుట్టారని అయ్యన్నపాత్రుడు వివరించారు. అలాగే పలనులకు వీళ్ళే వారికి మూడు నెలలకోసారి పింఛన్ తీసుకునే సౌకర్యం కల్పించారని చెప్పారు.

పింఛన్ పొందుతున్న వ్యక్తి భర్త మరణించిన వెంటనే, మరుసటి నెల నుంచే అతని భార్యకు పింఛన్ అందేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇలాంటి నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది పార్టీ శ్రేణుల కర్తవ్యంగా భావించాలన్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన 150 రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 60 కోట్లు మంజూరు చేయించామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. గ్రామాల్లో సిమెంటు రోడ్లుగా మార్పు, చెరువుల అభివృద్ధి, కాలువల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామ నాయకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో వివి రమణ, ఎమ్మార్వో రామారావు, సర్పంచ్ బిడిజాన రామకృష్ణ, ఎంపీటీసీ చింతల సూర్యకాంతం, మండల పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, జనసేన ఇన్చార్జ్ సూర్యచంద్ర, ఇతర నాయకులు కొల్లు సత్యనారాయణ, కొల్లు రాంబాబు, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ నల్లబెల్లి స్వామి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.