అనర్హత వేటు వేసిన స్పీకర్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభాపతి తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ పిటిషన్ తో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆనం రామ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై అనర్హత వేటు వేశారు స్పీకర్.
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా సభాపతి స్పందించారు. ఈ మేరకు వైసీపీకి చెందిన మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ పై వేటు వేశారు. దీంతో లెక్క సరి పోయిందంటున్నారు మిగతా పార్టీల నేతలు.
అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన నలుగురు అనర్హత వేటుకు గురి కాగా ఇదే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంకు చెందిన మరో నలుగురికి బిగ్ షాక్ తగిలింది. మొత్తం మీద త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ అనర్హత వేటుపై పెద్ద ఎత్తున చర్చ జరగనుంది.