వెల్లడించిన ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్
అమరావతి – ఈనెల 31 వ తేదిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండనందలి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు రాష్ట్ర ఆర్య, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేశ్. ఈ సందర్బంగా అమ్మ వారి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతీయాలకు అతీతంగా ఈ వేడుకలు జరపాలన్నారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఆర్య వైశ్య పదం వినపడితే చాలు చిరాకు పడిపోయేవాడని మండిపడ్డారు.
ఆర్య వైశ్య నాయకులన్నా, ఆర్య వైశ్య సంఘాలన్నా పట్టించు కోలేదన్నారు. వారి విన్నపాలను జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు . ప్రభుత్వం ఆర్య వైశ్య పదమే లేకుండా చేసి ముందుకెళ్లిందని వాపోయారు. అందుకు నిరసిస్తూ ఆర్య వైశ్యులు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారని చెప్పారు.
పార్టీలకు అతీతంగా రోడ్లపైకి వచ్చారని, వైసీపీ హయాంలో గుడులు, గుడులలోని సిబ్బందిని, సంఘాలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. సత్రాలను కూల్చారు. ఆర్యవైశ్యుల వ్యాపారాలపై దెబ్బతీశారని ఆరోపించారు. ఆర్య వైశ్యులను చిత్రహింసలకు గురిచేశారని అందుకే తగిన రీతిలో బుద్ది చెప్పారని అన్నారు డూండి రాకేశ్.