వెల్లడించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – రాష్ట్రంలో పెట్టుబడులపై కూటమి సర్కార్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ మూడో సమావేశంలో 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. దీంతో ఎస్ఐపిబీ ఇప్పటివరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ రూ. 3 లక్షల కోట్లు దాటాయి. అర్సెల్లార్ మిట్టల్, ఎన్టిపిసి, హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్ వంటి సంస్థలు పెట్టుబడులకు లైన్‌క్లియర్ అయ్యింది. ఈ మేరకు అన్ని అనుమతులు పూర్తి చేసి ప్రాజెక్టులను గ్రౌండ్ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
రూ. 1.36 లక్షల కోట్లతో ఏర్పాటయ్యే అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు, రూ. 96,000 కోట్లతో ఏర్పాటయ్యే బిపిసిఎల్ వంటి ప్రాజెక్టులకు మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 7 నెలల కాలంలో తీసుకు వచ్చిన పాలసీలు, అందిస్తున్న సహకారంతో పెట్టుబడుల రాక ఆశాజనకంగా సాగుతోందన్నారు. మొదటి ఎస్ఐపిబి సమావేశంలో రూ. 83,987 కోట్లు, రెండో ఎస్ఐపిబిలో రూ. 1,82,162 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు చంద్రబాబు నాయుడు.
ఈ రోజు జరిగిన మూడవ ఎస్ఐపిబి సమావేశంలో మరో రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామన్నారు. నేడు ఆమోదం పొందిన 15 ప్రాజెక్టుల ద్వారా రూ. 19,580 మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రూ. 3,10,925 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. వీటి ద్వారా 3,12,576 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని ఆశా భావం వ్యక్తం చేశారు.