DEVOTIONAL

రాముడి గుడిని ప్రారంభించిన షేక్ ఆసిఫ్

Share it with your family & friends

ఏపీ స్టేట్ మైనార్టీస్ చైర్మ‌న్ భారీ విరాళం

అమ‌రావ‌తి – ఏపీలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఓ వైపు కులం, మ‌తం పేరుతో కొట్టుకు చ‌స్తున్న ఈ త‌రుణంలో ఓ మైనార్టీ వ‌ర్గానికి చెందిన ఒక‌రు ఏకంగా రాముడి ఆల‌యాన్ని ప్రారంభించ‌డం విశేషం. ఇది ఏపీలో చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు వైసీపీకి చెందిన నాయ‌కుడు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏరి కోరి ఎంచుకుని ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా ఉన్న షేక్ ఆసిఫ్ కీల‌కంగా మారారు.

శుక్ర‌వారం ఏపీలోని విజ‌య‌వాడ లోని వించి పేట‌లో కొలువు తీరిన కోదండ రామ‌స్వామి ఆల‌యాన్ని ఏపీఎస్ఎంఎఫ్ఎస్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప్రారంభించారు. ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు ఆల‌య పాల‌క‌మండ‌లి. ఈ సంద‌ర్బంగా షేక్ ఆసిఫ్ ను అభినందించారు.

ఈ సంద‌ర్బంగా ఆల‌య అర్చ‌కులు పూజ‌లు చేశారు. షేక్ ఆసిఫ్ కులం, మ‌తంతో ప‌నేమిటి అని పేర్కొన్నారు. ఎవ‌రి దేవుడైనా అంతా ఒక్క‌టేన‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా త‌న జీవితంలో మ‌రిచి పోలేని స‌న్నివేశం ఏమిటంటే ఆల‌యాన్ని ప్రారంభించ‌డ‌మ‌ని తెలిపారు. తాను ఆల‌యానికి విరాళం కూడా ఇచ్చిన‌ట్లు తెలిపారు.