NEWSANDHRA PRADESHTELANGANA

తెలుగు రాష్ట్రాల‌లో నామినేష‌న్స్ క్లోజ్

Share it with your family & friends

26 శుక్ర‌వారం నామినేష‌న్ల ప‌రిశీల‌న

ఏపీ, తెలంగాణ – ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో వ‌చ్చే నెల మే 13న జ‌ర‌గ‌బోయే పోలింగ్ కు సంబంధించి అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఏప్రిల్ 25 గురువారం నాటితో నామినేష‌న్ల గ‌డువు ముగిసింది.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో నామినేష‌న్ల‌ను ఈనెల 18 నుంచి స్వీక‌రించ‌డం మొద‌లు పెట్టారు. ఇవాళ చివ‌రి రోజు కావ‌డంతో భారీ ఎత్తున నామినేష‌న్లు వేసేందుకు అభ్య‌ర్థులు పోటీ ప‌డ్డారు. ఈ మేర‌కు ఈనెల 26న నామినేష‌న్లు ప‌రిశీలించ‌డం జ‌రుగుతుంది.

ఇందులో భాగంగా ఏప్రిల్ 29వ తేదీ వ‌ర‌కు దాఖ‌లు చేసిన అభ్య‌ర్థులు నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకునే వీలు క‌ల్పించింది ఎన్నిక‌ల సంఘం. ఇదిలా ఉండ‌గా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఇవాళ పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆయ‌న వెంట ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు.