ఉన్నత స్థాయి కమిటీల ఏర్పాటు
మంత్రి అనగాని సత్య ప్రసాద్
హైదరాబాద్ – ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఇరువురు సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించు కోవాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి సంబంధించిన వివరాలను ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వివరించారు.
విభజన సమస్యల పై, ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీతో పాటుగా, అధికారుల కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాలు సీఎంలు నిర్ణయించారని చెప్పారు. .
విభజన సమస్యలు ఒక్కటే కాకుండా, గత 5 ఏళ్ళు పట్టి పీడించిన డ్రగ్స్, గంజాయి, సైబర్ క్రైమ్స్‌పై కూడా భేటీలో చర్చ జరిగింద్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని, రెండు రాష్ట్రాల ఏడీజీ స్థాయి అధికారులతో డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు అనగాని సత్య ప్రసాద్.